రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షాట్‌కు విశేషమైన ఆదరణ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్ వచ్చింది. ‘దేవర’ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ పెద్ది సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పెద్ది నుంచి జాన్వీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో జాన్వీ ‘అచ్చియ్యమ్మ’ అనే పాత్రలో సందడి చేయనుంది. ఈ మేరకు స్టిల్స్‌ని విడుదల చేసి ‘ఫైర్ బ్రాండ్’ అని పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు ఎఆర్ రహమాన్ సంగీతం ఈ సినిమాకు మరింత హైప్‌ని తెచ్చిపెట్టింది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.