హైదరాబాద్: బీటెక్ విద్యార్ది ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరబాద్ లోని జెఎన్ టియులో జరిగింది. సూర్యాపేట జిల్లా మోతె మండలం పెద్దరాజు తండాకు చెందిన విద్యార్ది భానోతు రవీందర్ నాయక్ (21) జెఎన్ టియులో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. జెఎన్ టియు హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి రవీందర్ ఆత్మహత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ మృతుడి బంధువుల ఆందోళన చేపట్టారు. కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.