మియాపూర్: జిహెచ్ఎంసి పరిధిలోని మియాపూర్ లోని 100 సర్వే నెంబర్ లో భారీ అక్రమ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూలగొట్టారు. అమీన్ పూర్ మున్సిపాలిటీలో సర్వే నెంబర్ మార్చి అక్రమ నిర్మాణం జరపడంతో ఐదంతస్థుల భవనాన్ని కూలగొట్టారు. హెచ్ఎండిఏ ఫెన్సింగ్ తొలగించి నిర్మాణదారులు అక్రమ నిర్మాణం జరిపినట్టు హైడ్రా గుర్తించింది. అక్రమ నిర్మాణాన్ని తొలగించడానికి శనివారం హైడ్రా, హెచ్ఎండిఎ అధికారులు వచ్చారు. భారీ పోలీస్ బందో బస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూలగొట్టారు. 100 సర్వే నెంబర్లలో నిర్మాణాలు జరిగాయని, దీనికి సంబంధించిన పర్మిషన్ అమీన్ పూర్ మున్సిపాలిటీ సర్వేనెంబర్ 307,308 మార్చి ఇచ్చినట్టు విచారణలో తేలింది.