త్రినాధ్ కటారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇట్లు మీ ఎదవ. సాహితీ అవంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. శుక్రవారం మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. యూత్‌ఫుల్ ఫన్, బ్యూటీఫుల్ లవ్ స్టొరీ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. ఈ ఈవెంట్‌లో హీరో, దర్శకుడు త్రినాధ్ కటారి మాట్లాడుతూ “ఈ సినిమాకి కథే హీరో. ఇందులో నేను ఎదవ అని ఒక క్యారెక్టర్ చేశాను. ఇది ఒక తండ్రి కొడుకుల కథ, తండ్రి కూతుర్ల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ. ఈ ముగ్గురు మధ్య ఉండే లవ్ స్టోరీ. ఈ సినిమాతో 100 శాతం అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాం”అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ “ఈ సినిమా యూత్ అందరికీ నచ్చుతుంది. యూత్ వాళ్ళ పేరెంట్స్‌ని కూడా తీసుకెళ్లి చూపించే సినిమా ఇది. సినిమా క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. నటీనటులందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో చాలా ఎంజాయ్ చేశాను”అని పేర్కొన్నారు. నిర్మాత బళ్లారి శంకర్ మాట్లాడుతూ “ఇది నా తొలి సినిమా. పట్నాయక్ మ్యూజిక్ అందించడం చాలా ఆనందంగా ఉంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిషి, తేజ మర్ని, గోపరాజు రమణ, దేవి ప్రసాద్, జగదీష్, మధుమణి, తాగుబోతు రమేష్ పాల్గొన్నారు.