అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోటకల్ క్రాస్ దగ్గర కూలీలను తీసుకెళ్తున్న ఆటోను టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెంపో అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.