అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఐ పోలవరం మండలంలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల బాలికపై జనసేన నేత రాయపురెడ్డి అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. స్కూల్‌కు సమీపంలో ఉన్న ఒక భవనానికి బాలికను తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పవడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జనసేన నేత రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ)పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరో తరగతి చదువుతున్న బాలికకు రాయపురెడ్డి చాకెట్లు, బిస్కెట్లు పలుమార్లు కొనిచ్చాడు. చాకెట్ల పేరుతో బాలికపై రాయపు రెడ్డి అత్యాచారం చేశాడని చిన్నారి తల్లి ఆరోపణలు చేసింది. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. తునిలో 63 ఏళ్ల తాటిక నారాయణ రావు ఓ బాలికపై అత్యాచారం చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.