మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో రెండు నెలల గడువు కావాలని అ సెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీం కో ర్టును కోరారు. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ తరఫున శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలలో పది మంది ఎమ్మెల్యేలు వి విధ కారాణాలతో, వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్ లో చేరారు. వారికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కండువా కప్పి స్వాగతించారు. దీంతో పార్టీ మా రిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వే యాల్సిందిగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోర్టులో పి టిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ జ రిపిన సుప్రీం కోర్టు మూడు నెలల్లోగా విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా
ఈ ఏడా ది జూలై 31న ఆదేశించించింది. ఈ గడువు శు క్రవారం ముగియడంతో, ఇంకా విచారణ పూర్తి కావాల్సి ఉన్నందున మరో రెండు నెలల సమ యం కావాలని స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు, కామన్‌వెల్త్ పార్లమెంటరీ ఆంతర్జాతీయ స దస్సుకు హాజరైనందున అనర్హత పిటిషన్ల విచార ణ పూర్తి చేసేందుకు సమయం సరిపోలేదని స్పీ కర్ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో దా ఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ని రోధక చట్టం కింద స్పీకర్ వద్ద పిటిషన్లు దాఖలయ్యాయి. వీరందరికీ స్పీకర్ కార్యాలయం నోటిసులు పంపించింది. కాగా వీరిలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగ తా ఎనిమిది మంది స్పీకర్‌కు సమాధానలిచ్చారు. ఆ ఎనిమిది మంది కూడా తాము పార్టీ మారలేదని, ప్రజా సమస్యల పరిష్కారానికి తాము సిఎం రేవంత్‌రెడ్డిని కలిసామని
చెప్పారు.
ఇదిలాఉండగా స్పీకర్ ఈ మూడు నెలల్లో నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యింది. మిగతా ఎమ్మెల్యేలపైనా విచారణ పూర్తి చేసేందుకు మరో రెండు నెలల గడువు కావాలని స్పీకర్ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనపై సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.కాగా జూలై నెలాఖరున సుప్రీం కోర్టు మూడు నెలల గడువు విధించినప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏళ్ళ తరబడి పార్టీ ఫిరాయింపు పిటిషన్లను ఉంచడం భావ్యం కాదని, ఆలస్యం జరిగితే ఫిరాయింపుదారులకు మేలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఆపరేషన్ సక్సెస్..పెషెండ్ డెడ్ అనే సూత్రంలా ఉండరాదని వ్యాఖ్యానించింది.