ప్రతిష్ఠాత్మకమైన ప్రొ కబడ్డీ సీజన్12లో దబాంగ్ ఢిల్లీ టీమ్ ఛాంపియన్‌గా నిలిచింది. శుక్రవారం ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో దబాంగ్ ఢిల్లీ 3128 పాయింట్ల తేడాతో పుణెరి పల్టాన్ టీమ్‌ను ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు ఢిల్లీ అటు పుణెరి టీమ్ సర్వం ఒడ్డి పోరాడాయి. దీంతో పోరులో ఉత్కంఠ నెలకొంది. ఒక దశలో పుణెరి టీమ్ ఆధిపత్యాన్ని చెలాయించింది. అయినా ఢిల్లీ ఒత్తిడికి గురి కాకుండా ముందుకు సాగింది. పల్టాన్ టీమ్ జోరును తట్టుకుంటూ లక్షం వైపు నడిచింది. రెండు జట్లు కూడా నువ్వానేనా అన్నట్టు పోరాడడంతో ఫైనల్ హోరాహోరీగా మారింది. నీరజ్ నర్వాల్ అద్భుత ఆటతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అసాధారణ ఆటను కనబరిచిన నీరజ్ 9 పాయింట్లు సాధించాడు. అజింక్య పవార్ ఆరు పాయింట్లతో తనవంతు సహకారం అందించాడు. మిగతా ఆటగాళ్లు కూడా మెరుగైన ప్రదర్శన చేయడంతో ఢిల్లీ జయకేతనం ఎగుర వేసింది.