ఉద్యోగుల బకాయిలు, పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రూ.1,032 కోట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఆర్థికశాఖ అధికారులతో పెండింగ్ బిల్లులు, బకాయిలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సిఎం భట్టీ ఆదేశాల మేరకు అధికారులు నిధులను విడుదల చేశారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల కోసం రూ.712 కోట్లు కాగా.. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ పెండింగ్ బిల్లుల కోసం రూ.320 కోట్లు విడుదల చేశారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన ఉద్యోగుల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా విడుదల చేస్తోంది.