ప్రమాదవశాత్తు నీటితో ఉన్న బకెట్లో పడి 18 నెలల చిన్నారి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా, చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రంలో గుడిబండ స్వప్న, ధనుంజయ్ దంపతుల కూతురు రుచిత ఇంటి దగ్గర ఆడుకుంటూ వెళ్లి నీటితో ఉన్న బకెట్‌లో పడింది. అనంతరం స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు మెదక్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది.చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువుల రోదన స్థానికులను కంటతడి పెట్టించింది.