ఇండియాలో మద్యం సేవించే వారికి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతోంది. అయితే మద్యం తాగే వారిలో తెలంగాణ 3స్థానం, ఎపి 4 స్థానంలో ఉండడం విశేషం. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 16కోట్ల మంది మద్యం తాగుతుండగా ఇందులో 6 కోట్ల మంది మద్యానికి బానిసలుగా మారారని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఇందులో పురుషులు, స్త్రీలు కూడా ఉన్నారని, వారి వయస్సు 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంటుందని ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఇండియాలో అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల టాప్ -10 జాబితాను ఈ నివేదికలో పేర్కొన్నారు. అందులో మొదటి స్థానాన్ని కర్ణాటక రాష్ట్రం దక్కించుకుంది.
రాష్ట్రాల జాబితా ఇలా..
మొదటిస్థానంలో కర్ణాటక, రెండోస్థానంలో తమిళనాడు, మూడోస్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఐదోస్థానంలో మహారాష్ట్ర, ఆరోస్థానంలో ఉత్తరప్రదేశ్, ఏడోస్థానంలో కేరళ, ఎనిమిదో స్థానంలో వెస్ట్ బెంగాల్, తొమ్మిదో స్థానంలో రాజస్థాన్, 10వ స్థానంలో ఢిల్లీ ఉన్నాయి.