ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పై 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. ఓపెనర్లు ట్రావీస్ హెడ్ 28 పరుగులు, మార్ష్ 46 పరుగులతోపాటు ఇంగ్లీస్ 20 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ 18.4 ఓవర్లలోనే 125 పరుగుల వద్ద ఆలౌటైంది. అభిషేక్ శర్మ అర్థశతకంతో చెలరేగగా.. హర్షిత్ రాణా 35 పరుగులతో రాణించాడు. మిగతా వారందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఎల్లిస్, బ్రేట్‌లెట్ లు చెరో రెండు వికెట్లు, స్టోయినీస్ ఒక వికెట్ తీశారు. కాగా, ఈ టీ20 సిరీస్ లో తొలి విజయాన్ని సాధించిన ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.