హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో బాలివుడ్, హాలీవుడ్ స్థాయి సినిమాలు నిర్మిస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి తెలిపారు. సినీ నిర్మాణాలకు వేదికలుగా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నాం అన్నారు. మహారాష్ట్ర ఫిల్మ్ సిటీ సందర్శించాలని మంత్రి కోమటి రెడ్డికి మహారాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి ఆశిష్ శెలార్ ఆహ్వానించారు. కోమటిరెడ్డితో మంత్రి ఆశిష్ శెలార్ భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి, ప్రభుత్వ పాలసీలపై మంత్రుల చర్చ జరిగింది. తెలంగాణను హాలీవుడ్ స్థాయి ఫిల్మ్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నామని కోమటి రెడ్డి పేర్కొన్నారు.