ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్కడే ఆసీస్ బౌలర్లు ధీటుగా ఎదుర్కొన్నాడు. భారీ షాట్లతో చెలరేగాడు. దీంతో కేవలం 37 బంతుల్లోనే 68 పరుగులతో మెరుపులు మెరిపించాడు. శర్మతోపాటు హర్షిత్ రాణా(35) రాణించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ను హేజిల్‌వుడ్ దెబ్బ కొట్టాడు. గిల్, సూర్యకుమార్ యాదవ్(1), తిలక వర్మ()లను ఔట్ చేసి టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. సంజుసాంసన్(1), శివమ్ దూబే(4), అక్షర్ పటేల్(7)లు కూడా తీవ్రంగా నిరాశపర్చారు. దీంతో భారత్ 18.4 ఓవర్లలోనే 125 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఎల్లిస్, బ్రేట్‌లెట్ లు చెరో రెండు వికెట్లు, స్టోయినీస్ ఒక వికెట్ తీశారు.