ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ ను ఆసీస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ దెబ్బ కొట్టాడు. నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతున్నాడు. వరుస ఓవర్లలో ఓపెనర్ శుభ్ మన్ గిల్(5), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(1), తిలక్ వర్మ(0)లు ఔట్ చేసి టిమిండియాకు షాకిచ్చాడు. వన్ డౌన్ లో వచ్చిన సంజు సామ్ సన్ ను నాథన్ ఎల్లిస్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ రనౌట్ గా వెనుదిరిగాడు. దీంతో 49 పరుగులకే భారత్ 5 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ అభిషేక్ శర్మ(), హర్షిత్ రాణా()లు ఉన్నారు.