హైదారాబాద్: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మధ్యప్రదేశ్ యువకులు నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశారు. చిన్నారిపై చాక్లెట్ ఆశ చూపి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేకలు వేయడంతో తలుపులు పగలగొట్టి స్థానికులు బాలికను రక్షించారు. సృహ కోల్పోయిన చిన్నారిని చౌటుప్పల్ ప్రభుత్వానికి తరలించారు. ఇద్దరు యువకులను స్థానికులు చితక బాది చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు.