హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణకు తెలంగాణ స్పీకర్ మరింత గడువు కోరారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై విచారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసింది. ఈ క్రమంలో స్పీకర్ కార్యాలయం.. ఎమ్మెల్యేల విచారణకు న్యాయస్థానాన్ని మరో రెండు నెలల గడువు కోరింది. పార్టీ ఫిరాయించిన10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వగా.. వారిలో 8 మంది మాత్రమే స్పందించారని, నలుగురి విచారణ మాత్రమే ముగిసిందని, మిగతా వారిని విచారించాల్సి ఉందని స్పీకర్ తరపు లాయర్లు సుప్రీంకోర్టుకు తెలిపారు.
కాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ కు సుప్రీం మూడు నెలల గడువు విధించింది.
సుప్రీంకోర్టుకు 2 నెలల గడువు కోరిన స్పీకర్ గడ్డం ప్రసాద్
నేటితో ముగిసిన సుప్రీంకోర్టు విధించిన 3 నెలల గడువు
నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయినట్లు సుప్రీంకోర్టుకు నివేదన