భారత మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ తెలంగాణ కేబినెట్ లోకి అడుగుపెట్టారు. శుక్రవారం ఆయన రాష్ట్ర మంత్రి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో అజారుద్దీన్ చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యారు. త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమండ్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం చర్చనీయాంశమైంది. మైనార్టీ ఓట్లను ఆకర్షించడానికే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా జాగ్రత్త పడుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ సీటును కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రచారన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో స్వయంగా సిఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఆయన ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.