హైదరాబాద్: మహిళ ప్రపంచ వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీ ఫైనల్‌లో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. అదీ ఆస్ట్రేలియాపై గెలవడం అంటే వరల్డ్ కప్ సాధించినంత ఆనందంగా ఉందని క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. టీమిండియా మహిళ జట్టున మాజీ క్రికెటర్లు ప్రశంసించారు. విజయంలో కీలకపాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్‌ను మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడారు. జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారని సచిన్ తెలిపారు.
శ్రీచరణి, దీప్తి శర్మ బంతితో మాయ చేశారని, ఇలాగే మున్ముందు మరిన్న విజయాలు సాదించాలని సచిన్ ఆకాంక్షించారు. అది ఆస్ట్రేలియాపై భారీ లక్ష్యాన్ని సాధించడం గొప్ప విషయమని టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మెచ్చుకున్నారు. బలమైన ఆస్ట్రేలియా నాకౌట్‌లో ఓడించడం అంత సులభంగా రాదన్నారు. తీవ్ర ఒత్తిడితో జెమీమా అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని విరాట్ కొనియాడారు. మరో సెమీ ఫైనల్ అని సులువుగా గెలిచి ఫైనల్ చేరాలని ఆసీస్ భావించిందని, మన అమ్మాయిలు అద్భుతంగా ఆస్ట్రేలిఆయను అడ్డుకున్నారని వీరేంద్ర సెహ్వాగ్ మెచచుకున్నారు. టీమిండియా ఆటను చూసి భారతీయులు గర్వపడుతున్నారన్నారు. టీమిండియా మహిళ జట్టు సంచలనం సృష్టించే అవకాశం ఉందన్నారు.