సిద్దిపేట: మద్యం తాగడానికి కన్నతల్లి రూ.5 వేలు ఇవ్వలేదనే కోపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీనాజీ పేట గ్రామంలో నాగరాజు అనే యువకుడు మద్యానికి బానిసగా మారాడు. మద్యం తాగేందుకు రూ.5000 ఇవ్వాలని తల్లితో యువకుడు గొడవకు దిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తల్లిపై కుమారుడు దాడి చేశాడు. అనంతరం మనస్తాపంతో కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.