హైదరాబాద్: సిపిఎం రైతు సంఘం నేత సామినేని రామారావు హత్యపై డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క దిగ్ర్బాంతి చెందారు. రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని భట్టి హెచ్చరించారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలకు తావులేదని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రామారావు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో చింత కాని మండలం పాతర్లపాడులో సిపిఎం రైతు సంఘం నేత సామినేని రామారావు హత్య జరిగిన విషయం తెలిసిందే. ఉదయపు నడకకు వెళ్లిన సమయంలో రామారావు గొంతు కోసి దుండగలు హతమార్చారు.