అమరావతి: మొంథా తుపాను మరింత బలహీనపడింది. మొంథా వాయుగుండం నుంచి తీవ్ర అల్పపీడనంగా మారింది. విదర్భ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. తీవ్ర అల్పపీడడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర కోస్తాకు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.తెలంగాణలో ఈ రోజు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు, ఈశాన్య తెలంగాణపై ప్రభావం ఉంటుంది. నవంబర్ 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. అక్టోబర్, నవంబరుల్లోనే తెలుగు రాష్ట్రాలపై మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.