మన తెలంగాణ/సిటీ బ్యూరో: చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో ప్లాట్లు కొనుగోలుచేసిన వా రికి నష్టం జరుగకుండా కొత్త ప్లాన్‌ను హైడ్రా రూపొందిస్తోంది. ప్రస్తతుం ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలోని ప్లాట్లలో బిల్డింగ్‌లు నిర్మించరాదనీ, అ నుమతులు మంజురు కావనీ, ప్లాట్ల యజమానులకు న్యాయం జరిగేలా చూడాలని నిర్ణయించిన హైడ్రా.. వారికి ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్(టిడిఆర్)లను మంజూరు చేయడం ద్వారా వా రికి మద్దతుగా నిలవాలని ప్లాన్ చేసింది. హైడ్రా పరిధి(ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతం)లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ వెబ్‌సైట్ ఆధారంగా 455 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్ల లో ప్లాట్లు చౌకగా వస్తున్నాయని మధ్యతరగతి ప్రజలే అధికంగా కొనుగోలు చేస్తారనీ, వారు ఏండ్లతరబడి చేసిన కష్టం కాస్త బురదపాలు కా వద్దని వారికి టిడిఆర్‌లు ఇవ్వడం ద్వారా ఆదుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించినట్టు సమాచారం. ఈమేరకు జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. వారి కష్టార్జితం నీటిపాలైతే.. వారి కుటుంబాలు ఆర్థికంగా చితికి రోడ్డునపడే అవకాశాలు ఉన్నందున వారి ప్లాట్లకు తగిన ధర పలికేట్టు టీడిఆర్‌లు ఇచ్చేదిశగా హైడ్రా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
ఆరు చెరువుల పునరుద్ద్ధరణ..
గ్రేటర్‌లో ఆరు చెరువులను పునరుద్దరించాలని హైడ్రా నిర్ణయించింది. ఇందులో బతుకమ్మ కుంట (అంబర్‌పేట్), బుమ్రుఖ్ దావాలా (రాజేంద్రనగర్), తమ్మిడి కుంట (ఎన్ కన్వెన్షన్), సున్నం చెరువు (మాదాపూర్), నల్ల చెరువు (కూకట్‌పల్లి), నల్ల/పెద్ద చెరువు (ఉప్పల్)ల కలుషితాన్ని అరికట్టడానికి డీవాటరింగ్, డీసిల్టింగ్, ఇన్‌ఫ్లో చానెళ్లను పునరుద్ధరించడం, మురుగునీటి మార్గాలను నిరోధించడం వంటివి నివారిచడం జరుగుతుంది. ఈపాటికే బతుకమ్మకుంటతో పాటు కూకట్‌పల్లి నల్ల చెరువు పునరుద్దరించడం దాదాపు పూర్తికావచ్చింది.
రాజేంద్రనగర్‌లోని బూమ్రుఖ్‌దౌలా చెరువు పనులు ప్రారంభించింన హైద్రా వీటి ద్వారా నగరంలోని చెరవులకు స్పూర్తిగా నిలపాలని హైడ్రా నిర్ణయించింది. ఈ 6 చెరువుల ఎఫ్‌టీఎల్ లను, బఫర్‌జోన్‌లను గుర్తించడంతో ఆందులో ప్లాట్లున్నాయి. అవి పూర్తిగా తొలగించాల్సి వస్తున్న నేపథ్యంలో ఆ ప్లాట్ల ధరలకు అనుగుణంగా ప్లాట్ల యజమానులకు టిడిఆర్‌లు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలని హైడ్రా కమిషనర్ నిర్ణయించార. ఈమేరకు జీహెచ్‌ఎంసి అధికారులకు లేఖ రాసి ఒప్పించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు హైడ్రా ప్రతిపాదనలను సిద్దం చేసి, సర్కారుకు, జీహెచ్‌ఎంసికి పంపాలని భావిస్తున్నట్లు తెలిసింది.
డబుల్ ధమాకా
చెరువులు, కుంటల పరిరక్షణ చర్యల్లో భాగంగా తొలగించిన, మున్ముందు తొలగించాల్సిన ప్లాట్లకు నగదు పరిహారానికి బదులుగా టీడీఆర్ ఇచ్చే విషయంపై జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలతో కలిసి హైడ్రా కసరత్తు చేస్తున్నది. గ్రేటర్ పరిధిలో 185 చెరువులతో పాటు గ్రేటర్ వెలుపల 270 చెరువులు ఉన్నాయి. వీటి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలోని ప్లాట్ల విలువకు రెట్టింపు విలువను కట్టించి అందుకు సమానంగా ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్(టిడిఆర్)లు జీహ్‌చెంసి, హెచ్‌ఎండిఏలతో మంజూరు చేయించనున్నది హైడ్రా. ప్లాటు విలువ మార్కెట్(ప్రభుత్వ) ధర రూ. 10 లక్షలుగా ఉంటే.. ఆ ధరను రెట్టింపుగా రూ. 20 లక్షలుగా టిడిఆర్ బాండ్స్‌ను అందించాలని హైడ్రా నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌ను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. కేవలం ప్రభుత్వ ధరకు అదనంగా అంతే ధర అంటే రెట్టింపు ధర వచ్చేలా టిడిఆర్‌లను మంజూరు చేయాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించి గ్రేటర్, హెచ్‌ఎండిఏల ద్వారా టిడిఆర్‌లు అందించేందుకు హైడ్రా సిద్దమవుతోంది.