ముంబై: కిడ్నాపర్ బారి నుంచి 17 మందిని సురక్షితం గా రక్షించారు. ముంబై లోని ఆర్ ఏ స్కూడియోలో 17 మంది పిల్లలను బందీలుగా ఉంచిన నిందితుడు రోహిత్ ఆర్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చనిపోయాడు. పిల్లల ను రక్షించే క్రమంలో కాల్పులు జరపక తప్పలేదు. గురువారం ముంబై లోని పోవై ప్రాంతంలో ఉన్న స్టూడియో లో రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడిన తర్వాత సురక్షితంగా ఇద్దరు పెద్దలతో పాటు పిల్లలు అందరినీ కాపాడారని అధికారులు తెలిపారు. పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.పిల్లలను విజయవంతంగా రక్షించిన తర్వాత ఆర్ ఏ స్టూడియో ఉద్యోగి అ యిన ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ముందు అధికారులు చెప్పారు. రిస్క్యూ ఆపరేషన్ కు ముందు తన డిమాండ్ ఏమిటో అధికారులకు చెప్పాలని అనుకుంటున్నట్లు నిందితుడు మెస్సేజ్ కూడా విడుదల చేశాడు. అ యితే, అతను పిల్లలను ఎందుకు బందీలుగా పట్టుకున్నా డో, అధికారులతో ఏమి మాట్లాడాలని అనుకున్నాడో ఖ చ్చితంగా తెలియలేదు.అంతకు ముందు ఆర్య అనే నిందితుడు తన వీడియో సందేశంలో
కొంతమంది తో మాట్లాడాలనే తన డిమాండ్ నెరవేరని పక్షంలో పిల్లలు, ఇద్దరు పెద్దలు బందీలుగా ఉన్న భవనానికి నిప్పుపెడతానని బెదిరించాడు. తాను టెర్రరిస్ట్ కానని, పిల్లలను విడిపించడానికి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయనని అతడు చెప్పాడు. అధికారులతో మాట్లాడాలన్నదే తన డిమాండ్ అని చెప్పాడు.తన మాట వినాలని అధికారులను గట్టిగా కోరుతూ, ఒకదశలో పిల్లలకు ఏదైనా హాని జరిగితే తన బాధ్యత ఏమీ లేదని ఆర్య అన్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పోవై పోలీసు స్టేషన్ కు 17 మంది బందీ పరిస్థితి విషయం తెలియడంతో పెద్దఎత్తున పోలీసు బృందాలు యాక్టింగ్ స్టూడియోకు చేరాయి. మొదట పోలీసులు ఆర్యతో చర్చలు జరపడానికి యత్నించారు. కానీ, అతడు తన డిమాండ్లపై మొండిగా పట్టుపట్టాడు. చర్చలు విఫలమైన తర్వాత, పోలీసులు పిల్లలను రక్షించేందుకు. బాత్రూమ్ ద్వారా బలవంతంగా స్టూడియోలోకి చొరబడ్డారని డిసిపి దత్తా మీడియాకు తెలిపారు. పిల్లలను రక్షించే క్రమంలో ఆర్యపై కాల్పులు జరిపి గాయపరిచారు. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు