మన తెలంగాణ/హైదరాబాద్: గతంలో అనేక కేసులు ఉ న్న అజారుద్దీన్‌ను మంత్రి వర్గంలోకి ఎలా తీసుకుంటారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సిబిఐ, కోర్టు కేసులు చాలా ఉన్న అజారుద్దీన్‌ను ఎలా మం త్రివర్గంలో చేర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధ్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వరకే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓ డిపోయిన అజారుద్దీన్‌ను ఇప్పుడు హడావుడిగా మంత్రిగా చేయాలని ఎందుకు నిర్ణయించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. గత 22 నెలలుగా మంత్రివర్గంలో ఒక్క మైనారిటీ వర్గానికి చెందిన మంత్రి కూడా లేరని, నిజంగా మైనారిటీ సంక్షేమంపై శ్రద్ధ ఉంటే ముందే అవకాశం ఇచ్చేవారని అన్నారు. ఇప్పుడు మైనార్టీల ఓట్ల కోసం ఎన్నికల ముందు గుర్తుకొచ్చిందా? అని ఎద్దేవా చేశారు.
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రి పదవిని ఇవ్వడం చట్ట విరుద్ధమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతగా దిగజారిపోయిందని విమర్శించారు. కేవలం మైనారిటీ ఓటర్ల సంతుష్టీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఖబ్రస్తాన్ భూములు, మంత్రి పదవులు తాయిలాలుగా ఉపయోగిస్తోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ ఆదేశాలతో మిలటరీ భూమిని ఖబర్‌స్తాన్‌కు కేటాయించిందని, అలాగే ఎర్రగడ్డలో కూడా ఇల్లీగల్‌గా ఖబర్‌స్తాన్‌కు భూములు కేటాయించారని ధ్వజమెత్తారు.
మజ్లిస్‌కు రక్షణకవచంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు
ఓవైసీ కనపడితే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వంగి వంగి సలాం కొడుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కుహనా లౌకికవాదం, బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ -బీఆర్‌ఎస్ పార్టీలు మజ్లిస్‌కు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు పట్టిన చీడ ఎంఐఎం అని కిషన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించిన కిషన్‌రెడ్డి ఎవరి ఒత్తిళ్లతో, ఎవరి సూట్ కేసులకు తలొగ్గి తమ అభ్యర్థిని కాంగ్రెస్‌కు అ ద్దెకు ఇచ్చిందని నిలదీశారు. మంత్రులను బస్తీలకు పంపిం చి, మజ్లిస్ నాయకులు ప్రత్యర్థులపై దాడులు, బెదిరింపుల కు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అలాం టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థులపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.
స్లాటర్ హౌస్‌ల వెనుక ఎంఐఎం నేతలే
రాష్ట్రంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న పశు వధశాల (స్లాటర్ హౌస్)లు వెనుక ఉన్నది ఎంఐఎం నేతలేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు. స్లాటర్ హౌస్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న 39 స్లాటర్ హౌస్‌లపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని అ న్నారు. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో గోవుల అక్రమ రవాణా, గోహత్య, పశుమాంస ఎగుమతి పెద్ద మాఫియా గా మారిందని ఆరోపించారు. ఎంఐఎం పార్టీకి చెందిన బ హదూర్పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, రసూల్పురా కా ర్పొరేటర్ మహ్మద్ ఖాదర్ వంటి వారు రెగ్యులర్‌గా పోలీ సు స్టేషన్లకు వెళ్లి అధికారులను బెదిరించి వాహనాలను విడిపించడం సాధారణంగా మారిందని విమర్శించారు.