మనతెలంగాణ/హైదరాబాద్:కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రె స్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యా హ్నం 12.15 నిమిషాలకు రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణ స్వీ కారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సి ద్ధమైంది. నేడు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ అజారుద్దీన్‌తో మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ దఫా విస్తరణలో కేవలం అజార్‌ను మాత్రమే కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. రే వంత్ మంత్రివర్గంలో మైనార్టీలకు చోటులేదని విమర్శలు చా లా కాలంగా ఉన్నాయి.
దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పద వి ఇవ్వడంతో పాటు అజారుద్దీన్‌కుమంత్రి పదవి కట్టబెట్టి మై నార్టీలను సంతృప్తి పరచడంతో పాటు హైదరాబాద్ జిల్లా నుం చి కేబినెట్లో ప్రాతినిథ్యం కల్పించాలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి కాగా, గవర్నర్ కోటాలో అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం పంపించిన దస్త్రం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేస్తే ఆరునెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా నామినేట్ కావాల్సి ఉంటుంది.