అమరావతి: మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిశాయి. నదులు, వాగులు, వంకలు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. శారద నదికి గండిపడడంతో వైలోవ గ్రామం నీటిలో మునిగిపోయింది. దీంతో గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. అంతకంతకూ వరద ప్రవాహం పెరగడంతో నీటమట్టం పెరుగుతుందని గ్రామస్థులు వాపోతున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో శారద నది గండి పడటడంతో వైలోవ గ్రామం నీటమునిగింది. మొంథా తుపాన్ ప్రభావంతో చేతికి వచ్చిన పంటలను రైతులను కోల్పోయారు. రైతుల ఆర్థికంగా పూర్తిగా నష్టపోయారు.