యాదాద్రి భువనగిరి: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్ఈ రామారావు ఎసిబి వలకు చిక్కారు. మిషనరీ ఖరీదు ఇప్పించడానికి రూ.1, 90,000 లంచం ఓ కాంట్రక్టర్ నుంచి తీసుకుంటున్న ఎస్ఇ రామారావును ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్ఇగా రామారావు బాధ్యతలు స్వీకరించారు. యాదగిరిగుట్టలో లడ్డు కౌంటర్లు టెండర్ ద్వారా ఓ కాంట్రాక్టర్ మిషనరీ సప్లై చేశాడు. మిషనరీ ఖరీదు 11,50,000 ఆ బిల్లు కాగా ఇప్పించడానికి 20% కమిషన్ ను ఆ కాంట్రాక్టర్ ను రామారావు అడిగారు. ఇద్దరి మధ్యలో ఒక లక్ష 90 వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. కాంట్రాక్టర్ ఎసిబి వాళ్ళని కలవడంతో నల్గొండ ఎసిబి అధికారులను కలిశారు. రామారావు ఆడియో కాల్స్ డేటాను సేకరించి మేడిపల్లిలో నిన్న సాయంత్రం రూ. 1,90,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. రామారావుకు సంబంధించిన యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రామారావుకు హైదరాబాదులోని ఎల్బీనగర్ లో ఉన్న ఇంటిపై కూడా ఎసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం ఈ రోజు మధ్యాహ్నం వరకి తెలుస్తుందని ఎసిబి డిఎస్ పి చెప్పాడు. రామారావును జ్యూడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లి కోర్టుకు తరలించారు. ఉమ్మడి నలగొండ జిల్లా ప్రజలకు ఇలాంటి సమాచారం ఉంటే మాకు ఇవ్వాలని ఎసిబి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.