అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో 15 మంది కల్లుతాగి అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు మూలంగానే తమవారు అనారోగ్య బారినపడ్డారని కుటుంబీకులు ఆరోపణలు చేస్తున్నారు. వైద్యులు వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కల్లీ కల్లు తాగి బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారు. టిడిపి ఎంఎల్ఎ బాలకృష్ణ ఇలాకాలో కల్తీ కల్లు కలకలం సృష్టిస్తోంది. కల్తీ విచ్చలవిడిగా అమ్ముతున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ కల్లు అమ్మేవారికి స్థానిక రాజకీయ నాయకుల మద్దతు ఉండడంతో వారిపై ఈగ కూడా వాలడం లేదని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ కల్లుతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబడుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు మామూళ్లు అందుతుండడంతో చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని బాధితుల కుటుంబాలు ఆరోపణలు చేస్తున్నాయి.