మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వా యుగుండం మొంథా తుఫానుగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురిశాయి. తుఫాను దాటికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతాకులమయింది. పంట పోలాలు చెరువులను తలపించాయి, కల్లాల్లో ధాన్యం నీట మునిగిపోయింది, పలు చోట్ల ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామా సిద్దిపేట యాద్రాది భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఆదిలాబాద్, నిర్మ ల్, మంచిర్యాల, జగిత్యాలతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో ఇళ్లు మునిపోయాయి. కుండపోత వర్షానికి హన్మకొండ బస్‌స్టాండ్ వరద నీటితో చెరువులా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఇంటర్ సిటీ, ఈస్ట్‌కోస్ట్ రైళ్లు నిలిచిపోయాయి. డోర్నాకల్ రైల్వే ట్రాక్‌పై రెండు అడుగుల మేర నీరు చేరడంతో గోల్కోండ ఎక్స్‌ప్రెస్ నిలిపివేసి, ప్రయాణికులను బస్సుల్లో గమ్యస్థానాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఐదు గంటల పాటు మహబూబాబాద్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది.
రైల్వే ట్రాప్‌పై నీరు తగ్గకపోవడంతో తిరిగి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను వెనక్కి వరంగల్‌కు పంపించారు. గుండ్రాతిమడుగు నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను వెనక్కి వరంగల్ పంపిన అధికారులు రైల్వే ట్రాక్‌పై నీటిని తరలించే చర్యలు చేపట్టారు. కాజీపేట-విజయవాడ మార్గం లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హన్మకొండలోని చెన్నారావు పేటలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో వరద నీరు చేరింది. నెక్కొండ, నర్సంపేట ప్రధాన రహదారిలోని పాతముగ్ధుంపురం వద్ద లో లెవల్ వంతెనపై నుంచి నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. పాకాల వా గు పొంగడంతో గార్ల, మద్దివంచ, రామచంద్రాపురం గ్రామాలకు, వట్టివాగు పొంగడంతో కేసముద్రం-గూడురు మద్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం వరగల్ ప్రధాన రహదారిపై భారీగా నిలిచిన వరద నీరు చేరడంతో పోలీసులు ఒక వైపు తాత్కాలికంగా రహాదారిని మూసివేశారు. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోయింది. మొంథా తుఫాను దాటికి ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ప్రవాహాం 19 అడుగులకు చేరడంతో పునరావాస కేంద్రాలు సిద్దం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
ఖమ్మం జిల్లా నిమ్మవాగులో కొట్టుకుపోయిన లారీ
కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలోని జాన్నారంఅంజనాపురం గ్రామాల మధ్య నిమ్మవాగు పొంగి పొర్లుతుంది. ఈ వాగును డిసిఎం లారీ దాటించే ప్రయత్నం చేయడంతొ వరదలో చిక్కుకుపోయింది. నీటి ప్రవాహానికి మధ్యలోకి వెళ్లిన తరువాత బ్రిడ్జి పిల్లర్‌కు తగిలి లారీ నిలిచిపోయింది. ఈ క్రమంలో బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న స్థానికులు దిగిరావాలని కోరినా డ్రైవర్ మురళి(32) వాహనాన్ని కదిలించే ప్రయత్నం చేశాడు. దీంతో డ్రైవర్‌తో సహా లారీ వరద ఉదృతికి కొట్టుకుపోయింది.
కూసుమంచి మండంలంలోని పాలేరు జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 1,100 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. చింతకాని మండల వ్యాప్తంగా కురిసిన వర్షాలకు నాగులవంచ-పాతర్లపాడు మధ్య బండి రేపు వాడు రహదారిపై వాగు పొంగి ప్రవహిస్తుండటంతొ ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. కారేపల్లి గ్రామంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆర్ అండ్ బి మధ్యలో చిన్న వంతెనపై నీళ్లు ప్రవహిస్తుండటంతో ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోయాయి. కారేపల్లి కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయం సమీపంలో నీరు ప్రవహించడంతో విద్యార్థినిలు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటిపల్లి, అవుసలికుంట మధ్య కారు దాటుతున్న సమయంలో పక్కకు కొట్టుకుపోయింది. తాడూరు మండలం గోవిందపల్లి వద్ద వాగు దాటుతున్న గొర్రెల మందలోని గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. కలెక్టర్ కార్యాలయానికి ఆనుకొని ఉన్న కెఎల్‌ఐ కాలువ ఉప్పొంగి ప్రవహిస్తూ వరద నీరుత కలెక్టరేట్ ఆవరణలోకి భారీగా చేరుకుంది. భారీ వర్షానికి నాగర్‌కర్నూల్ జిల్లాలోని డిండి -హాజీపూర్ మధ్య కాజ్ వే కోతకు గు రైంది. దీంతో హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి.
శ్రీ శైలం నుంచి వస్తున్న వాహనదారులు హాజీపూర్ సమీపంలో నిలిచిపోవాల్సి వస్తోంది. అదే విధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు డిండి దగ్గర ఆగాల్సి వచ్చింది. మండలంలోని తీగలపల్లి నుంచి నాగర్‌కర్నూల్‌కి వెళ్లే ప్రధాన రహదారి ఏడుదల జలాశయం కట్టపై బుదర పేరుకుపోయింది. దీం తో మూడు రోజుల నుంచి ఆర్టీసి బస్సులను నిలిపివేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్డండ మండలంలో బైరాపూర్ గ్రామ సమీపంలోని వంతెన పై నుంచి సిమెంట్ పైపుల చుట్టే రక్షణగా ఉన్న మట్టి కోతకు గురికావడంతో వివిధ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చారకొండ మండలం ఎర్రవల్లి, గోక రం గ్రామాల మధ్య రదారిపై వాగు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తుండంటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలంలొ మూడు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కోడేరు-పసుపుల, బావాయిపల్లి-పెద్దకొత్తపల్లి-ఖానాపూర్-సాతాపూర్ గ్రామా ల మధ్య వాగులు పొంగతంతొ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
సూర్యాపేటలో బైక్‌పై వెళుతున్న వ్యక్తిపై చెట్టు కూలి మృతి
సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చెందిన కోట లక్ష్మీనారాయణ(45) తానం చర్ల నుండి మద్దిరాలకు తన వ్యవసాయ క్షేత్రాన్ని వెళుతున్న క్రమంలో చందుపట్ల గ్రామ శివారులో కొత్త పాఠశా సమీపంలో ఈదురు గాలికి రోడ్డుపై ప్రయాణిస్తున్న అతనిపై చెట్టుకూలింది దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. జనగామ జిల్లా అంబటిపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అంబటిపల్లి నుండి లింగాలకు ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో కారును వాగు దాటించే ప్రయత్నం చేయడంతో వరద ఉధృతికి కారు కొద్ది దూరం కొట్టుకుపోయి వరద నీటిలో చిక్కుకుంది. దీంతో హుటాహుటిన జెసిబి సహాయంతో కారును, వెంకటరెడ్డిని బయటకు తీసుకువచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో కురుస్తున్న వర్షాలకు గోకారం, చంద్రయాన్‌పల్లి, ఎర్రవల్లి గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించి రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. నాంపల్లి మండలంలోని రాందాస్ తండా వద్ద శేషలేటి వాగు వరద నీటి ప్రవాహ వేగానికి రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించింది.
నల్గొండ జిల్లా దేవరకొండ మడమడకలో గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. దేవర కొండ మండలం కొమ్మేపల్లిలో వరద నీరు పాఠశాలను చుట్టుముట్టడంతో అధికారులు తాడు సహాయంతో సుమారు 500 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. శేషలేటి వాగు వరద నీటి ప్రవాహ వేగం ఆర్ అండ్ బి రోడ్డు కాజ్వే పై నుండి ప్రవాహం కొనసాగుతుండడంతో రహదారికి ఇరువైపులా రాకపోకలను నిలిపివేశారు. చండూరు వైపు నుండి నాంపల్లి ద్వారా హైదరాబాద్ వెళ్లే వాహనాలను మర్రిగూడెం ద్వారా హైదరాబాదు వైపు మళ్ళించారు. నాంపల్లి నుండి కొండమల్లేపల్లి వైపు రాకపోకలకు ఉపయోగించే ఆర్ అండ్ బి రోడ్డు ముష్టిపల్లి కట్టకింద వాగు పై ఉన్న బ్రిడ్జి పై నుండి వరద ప్రవాహం వెళుతుండడంతో నాంపల్లి కొండమల్లేపల్లి మధ్య రాకపోకలు స్తంభించాయి.
137 రైళ్లు పూర్తిగా, ఏడు రైళ్లు పాక్షికంగా రద్దు
మొంథా తుఫాను ధాటికి దక్షిణ మధ్య రైల్లే 137 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, ఏడు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. దీంతో పాటుగా 30 రైళ్లను దారి మళ్లించింది. అనేక రైళ్లను రీ షెడ్యూల్ చేసింది. పలు గూడ్సురైళ్లు స్టేషన్లలోనే నిలిచిపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం నమోదు
తుఫాను ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో అత్యధికంగా 31.6 సెం.మీ వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.