మన తెలంగాణ/హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అవకతవకలు, అక్రమాలపై చె క్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్ తో ఇప్పటికే పలుమార్లు ఇంజినీరింగ్ కళా శా లలు (వృత్తి విద్యా కళాశాలలు) యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించటం మరో మలుపు తిరిగింది. కళాశాలల నిర్వహణ, నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా? ఇందులో చేరుతున్న విద్యార్థులకు నిబంధనల ప్రకారమే ప్రవేశాలు జరిగాయా? వాటిలో నిబంధనల మేరకు వసతి సౌకర్యాలు ఉన్నాయా? రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అర్హులైనా? తదితర అంశాలపై విచారణ జరిపి నివేదిక
ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ విజిలెన్స్ విచారణకు స హకారం అందించాల్సిందిగా వృత్తి విద్యా శా ఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పోలీసు, విద్యాశాఖ సహకారంతో రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న ప్రైవేటు, వృత్తి విద్యా కళాశాలల సంస్థలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న వృత్తి విద్యా కళాశాలలకు అనుమతి ఉందా? లేదా?, వీటిలో చదువుతున్న విద్యార్థులు అర్హులైనా? వారి అడ్మిషన్స్ నిబంధనల ప్రకారమే జరిగాయా?, ఈ కళాశాలలకు టీచింగ్, నాన్ టీచింగ్ తగినంతగా ఉందా? లేదా? ఈ కళాశాలలకు క్లాస్‌రూంలు, ఫర్నిచర్,
ల్యాబ్స్ తదితర మౌలిక వసతులు నిబంధనలు ప్రకారం కలిగి ఉన్నాయా? లేవా? ఇందులో చదువుకున్న విద్యార్థులు నాణ్యమైన విద్య అందిస్తున్నాయా? లేవా?, విశ్వవిద్యా యాల మార్గదర్శకాలను, ప్రభుత్వ మార్గదర్శకాలను ఈ కళాశాలలు పాటిస్తున్నాయా? లేవా?, ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాజరు శాతం సక్రమంగా ఉందా? లేదా?, ఈ కళాశాలలో ఉన్న అవకతవకలు, అక్రమాలపై ఏమైనా ఫిర్యాదులున్నాయా , అలాగే విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ తనిఖీలకు వెళ్లినప్పుడు వారికి ఎదురైన అనుభవాలను ఈ నివేదికలో పొందుపర్చాల్సిందిగా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. హయ్యర్, స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలు తమ అధికారులను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలకు సహకారం అందించేందుకు పంపాల్సిందిగా ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న కళాశాలల పనితీరుతో పాటు పేద విద్యార్థులకు ఉద్దేశించిన ఫీజులు సక్రమంగా వినియోగమవుతున్నాయా? లేదా? తదతరాంశాలపై వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.