అంబాలా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం వీర నా రీ అయ్యారు. హర్యానాలోని అంబాలాలో భారతీయ వా యుసేన స్థావరం నుంచి ఆమె రఫేల్ యుద్ధ విమానం లో విన్యాస విహారం చేశారు. సహ పైలట్‌గా ముందుకు సాగారు. రాష్ట్రపతి ప్ర త్యేక యూనిఫాం ధరించి రఫేల్ యుద్ధ విమానాన్ని అధిరోహించి విహరిస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఓ యుద్ధ విమానంలో త న ప్రయాణం సాహసోపేత, ఆనందదాయక అనుభూతిని ఇచ్చిందని రాష్ట్రపతి తెలిపారు. ఇది తాను మరవలేని అపురూ పక్షణం అని స్పందించారు. భారతీయ రక్షణ పాటవ దిశలో ఇది మరింత గర్వకార ణం అని పేర్కొన్నారు. భారతీయ ఫైట ర్ విమానాలలో రెండు సార్లు ప్రయాణించిన ఘనత పొందిన తొలి రాష్ట్రపతిగా ఆ మె నిలిచారు. 2023 ఏప్రిల్‌లో రాష్ట్రపతి అ సోంలోని తేజ్‌పూర్ వైమానిక స్థావరం నుంచి సుఖోయ్-౩౦
ఎంకెఐ యుద్ధ విమానంలో ఇటువంటి సాహస యా త్రనే చేశా రు. ఇప్పుడు ఆమె రఫేల్‌ను ఎంచుకుని ముం దుకు సాగారు. భారత త్రివిధ సా యుధ బలగాలకు స ర్వం సహాధికారి హోదాలో రాష్ట్రపతి ప్రత్యేకంగా జి సూ ట్, సన్ గ్లాస్‌తో రఫేల్‌లోకి వెళ్లారు. ఉదయం 11.27 నిమిషాలకు యుద్ధ విమాన ప్రయాణం సాగింది. రాష్ట్రపతికి ముందుగా అంబాలా వైమానిక స్థావరంలో దేశ తొ లి మహిళా రఫేల్ యుద్ధ విమాన పైలట్, స్కాడ్రన్ లీడ ర్ శివాంగి సింగ్ స్వాగతం పలికారు. ఆమెను విమా నం వరకూ తోడ్కోని వెళ్లారు. ఫ్రాన్స్ కంపెనీ తయారీ రఫేల్ లో గ్రూప్ క్యాప్టెన్ అ మిత్ గెహాని సారధ్యంలో రఫేల్ స ముద్ర మట్టానికి దాదాపు 15,000 అడుగుల ఎత్తున, గంటకు 700 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లింది. అరగంట పాటు దాదాపు 200 కిలోమీటర్ల వరకూ ఆమె రఫేల్‌లో ప్రయాణించారు. అపార శక్తిపాటవ శక్తిని రా ష్ట్రపతి స్వయంగా స్వీయానుభవంతో పరిశీలించారు. రాష్ట్రపతి రఫేల్ వి న్యాసం గురించి ఆ తరువాత రాష్ట్రపతి భ వన్ వర్గాలు తమ ప్రకటనలో తెలిపాయి.
దేశ వాయుసేన సివంగి శివాంగి
వారణాసిలో పుట్టి పెరిగి, అక్కడే చదివిన పైలట్ శివాంగి సింగ్‌ను ఆపరేషన్ సిందూర్ దశలో తాము పట్టుకున్న ట్లు, ఆమె యుద్ధ ఖైదీ అయినట్లు పాకిస్థాన్ ప్రచారం చేసుకుంది. పలు యుద్ధ విమానాలలో పైలట్‌గా వ్యవహరించి తన సత్తా చాటుకున్న శివాంగి ఇప్పుడు రఫేల్ పై లట్‌గా కూడా తన శక్తిని పలు దశలలో తె లియచేశారు. రఫేల్ రాణిగా పేరొందిన శివాంగి భారతీయ వైమానిక దళానికి ప్ర త్యేకతను తీసుకువచ్చారు. భారత్ యుద్ధ విమానాలను నేలకూల్చినట్లు ఆపరేషన్ సిందూర్ చర్య దశలో పాక్ సైన్యం సా మాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం సాగించింది. అయితే అది తప్పుడు ప్రచారం అని ప్రపంచానికి తాజాగా నిర్థారణ అయింది. పాక్ అసత్య ప్రచారాన్ని పలు దఫాలుగా ఖండించిన భారత ప్రభుత్వం మరోసారి రాష్ట్రపతికి ఆమెతో స్వాగతం పలికించడం విశేషం. వైమానిక స్థావరంలో ఆమె గర్వంగా నవ్వుతూ రాష్ట్రపతి పక్కన నిలబడడం వాయుసేన, సైనిక శక్తిలో మహిళా ప్రాతినిధ్యాన్ని చాటింది.