బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో టి20లో వెస్టిండీస్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 20తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు సాధించింది. అలిక్ అథనాజె, కెప్టెన్ షాయ్ హోప్ అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ అథనాజె 33 బంతుల్లో 5 ఫోర్లు,3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. హోప్ 36 బంతుల్లో 3 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 55 పరుగులు సాధించాడు. రోస్టన్ ఛేజన్ (17), షెఫర్డ్ (13) పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. తంజీద్ హసన్ (61), లిటన్ దాస్ (23) తప్ప మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు.