అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతి పెద్ద వయసులో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో టాప్ ర్యాంక్‌ను సాధించడం రోహిత్ కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. రెండో వన్డేలో అర్ధ సెంచరీ సాధించిన హిట్ మ్యాచ్ మూడో వన్డేలో అజేయ శతకంతో అలరించాడు. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు టాప్ ర్యాంక్‌లో కొనసాగిన శుభ్‌మన్ గిల్ మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. రోహిత్ 781 రేటింగ్ పాయింట్లతో గిల్‌ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ రెండు ర్యాంక్‌లను మెరుగు పరుచుకున్నాడు.ఇక ఆస్ట్రేలియా సిరీస్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్ గిల్ టాప్ ర్యాంక్‌ను చేజార్చుకున్నాడు.
ఇబ్రహీం జద్రాన్ (అఫ్గాన్) రెండో ర్యాంక్‌ను, బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. డారిల్ మిఛెల్ (న్యూజిలాండ్) ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి ఒక ర్యాంక్‌ను కోల్పోయి ఆరో స్థానంలో నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (భారత్) తొమ్మిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. కెఎల్ రాహుల్ 14వ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్ (అఫ్గాన్) 710 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా) రెండో, మహీశ్ తీక్షణ (శ్రీలంక) మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. మిఛెల్ సాంట్నర్ (న్యూజిలాండ్) మూడు ర్యాంక్‌లు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నారు. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్) ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. భారత బౌలర్ కుల్దీప్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. జడేజా 13వ, సిరాజ్ 16వ ర్యాంక్‌ను దక్కించుకున్నారు.