శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన గల మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బుధవారం మూసివేసినట్టు ఎస్‌ఆర్‌ఎస్‌పి ఇఇ చక్రపాణి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఏటా జూలై 1వ తేదీన ఎత్తి అక్టోబర్ 28వ తేదీ వరకు తెరిచి ఉంచుతామని తెలిపారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ఈనెల 29వ తేదీ ఉదయం గేట్లను మూసివేయాల్సి ఉందని అన్నారు. అందులో భాగంగా బుధవారం మహారాష్ట్ర=తెలంగాణ సిడబ్లుసి ఇంజినీర్ల సమక్షంలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మూసివేశామని తెలిపారు. ఎగువన వర్షాలు కురవడంతో వరద కొనసాగడంతో నాలుగు గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీన మళ్లీ గేట్లను ఎత్తి తాగునీటి అవసరాల కోసం 0.60 టిఎంసిల నీటిని శ్రీరాంసాగర్‌కు విడుదల చేస్తామని తెలిపారు.