అమరావతి: మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్‌ని అల్లకల్లోలం చేసేస్తోంది. కొన్ని జిల్లాలు ఇప్పటికే తుఫాను కారణంగా అతలాకుతలం అయ్యాయి. అధికారులు ముందుగానే స్పందించి తుఫాను ప్రభావిత ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. తాజాగా తుఫాను బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువగా ఉంటే గరిష్టంగా రూ.3 వేలు అందజేయాలని అధికారులు పేర్కొన్నారు. పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్లే ముందు ఈ నగదు ఇవ్వనున్నారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.