హైదరాబాద్: మాజీ క్రికెటర్ ఎమ్మెల్సీ అజారుద్ధీన్‌కు రాష్ట్ర సర్కార్ నుంచి శుభవార్త అందింది. ఆయన మంత్రిగా ప్రమాణస్వీకరం చేసేందుకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఎఐసిసి పచ్చజెండా ఊపింది. శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ అజారుద్ధీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అజారుద్దీన్‌కి హోం, మైనారిటీ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉంది.