కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్.. ఆతిథ్య జట్టుతో ఐదు టి-20ల సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది. కాన్‌బెర్రా వేదికగా తొలి టి-20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్.. బౌలింగ్ ఎంచుకొని.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కానీ, కొద్ది రోజుల క్రితం ఇరు జట్లు మధ్య జరిగిన వన్డే సిరీస్‌ని ఆస్ట్రేలియా 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో టి-20 సిరీస్‌ని దక్కించుకొని ప్రతీకారం తీర్చుకోవాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది.
తుది జట్ల వివరాలు:
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవర్ బర్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నేమాన్, జోష్ హేజిల్‌వుడ్.