దుబాయ్: తల్లి పుట్టిన తేదీని లాటరీ నెంబర్ గా తీసుకొని ఓ తెలుగు యువకుడు భారీగా డబ్బు గెలుచుకున్నాడు. యుఎఇలో తెలుగు యువకుడికి రూ.240 కోట్ల లాటరీ తగిలింది. బోళ్ల అనిల్ కుమార్ అనే యువకుడు తల్లి పుట్టిన రోజు తేదీనే లాటరీ టికెట్ నెంబర్‌గా ఎంచుకొని లాటరీ గెలిచాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బోళ్ల అనిల్ కుమార్ అబుదాబి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు. అతనికి ఉన్న లాటరీ టికెట్ల కొనుగోలు అలవాటులో భాగంగా ఒక లాటరీ కొన్నాడు. ఈనెల 18న జరిగిన లక్కీ డ్రాలో 100 మిలియన్ దిర్హామ్స్ ను అనిల్ కుమార్ గెలుచుకున్నాడు. ఇందులో తన ప్రత్యేకత ఏమీ లేదని, అందరిలాగే లాటరీ టికెట్ కొన్నానని వివరణ ఇచ్చాడు. అందులో చివరి నంబర్లు మా అమ్మ పుట్టిన తేదీ కావడంతోనే తనకు అదృష్టం కలిసి వచ్చిందని సదరు యువకుడు తెలిపాడు.