హైదరాబాద్: టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య ఐదు టి20ల సిరీస్ జరగనుంది. భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ బ్యాటింగ్ ఫామ్‌పై ఆందోళన ఉంది. ఈ సంవత్సరం 12 టి20 మ్యాచ్‌లు ఆడాడు కానీ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై చేసిన 47 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. అభిషేక్ శర్మ కంటే ముందు టి20ల్లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డులో ఉన్నాడు. ఇప్పుడు ఆ రికార్డులకు అందనంత దూరంలో ఉండిపోయాడు. గత సంవత్సరం ఐపిఎల్‌లో 700 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ సందర్భంగా సూర్యకుమార్ ఫామ్‌పై అభిషేక్ నాయర్ స్పందించారు. ఆసీస్ పిచ్ కండిషన్, బౌన్స్ తప్పకుండా సూర్యకుమార్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయన్నారు.
గత 12 మ్యాచ్‌లలో అతడి పేలవ బ్యాటింగ్ తీరు, ఇప్పటి మ్యాచ్‌లపై పడదు అనుకుంటున్నానని వివరణ ఇచ్చాడు. కొన్ని సార్లు జట్టు విజయాలు వ్యక్తిగత ప్రదర్శనలను కప్పేస్తాయని, ఫలితాల్లో వ్యత్యాసం వచ్చినప్పుడే ప్రశ్నిస్తారని తెలిపారు. టి20ల్లో చాలా సంవత్సరాల పాటు సూర్య నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ ఉన్న విషయాన్ని నాయర్ గుర్తు చేశారు. అతడి ఆటతీరు జట్టులో స్క్రూటినీ జరిగి ఉంటుందని భావిస్తున్నానన్నారు. ఆస్ట్రేలియాలో సూర్య రాణిస్తే ఈ సిరీస్ మరింత ఆసక్తికరంగా మారుతుందన్నారు. గత ఐపిఎల్‌లో అతడి ఆటతీరును మర్చిపోకూడదని అభిషేక్ తెలియజేశారు. పాత సూర్యను చూస్తామని బ్యాటింగ్ తోనే సమాధానం చెబుతాడని ధీమా వ్యక్తం చేశారు.