కరీంనగర్: స్నేహితులు అప్పు తీసుకొని చెల్లించడంలేదని ఓ డాక్టరు మత్తు ఇంజెక్షన్లు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంకమ్మతోటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కరీంనగర్‌లోని ఓ వైద్య విజ్ఞాన సంస్థలో ఎంపటి శ్రీనివాస్(43) అనే వైద్యుడు ఎనస్తీషియా విభాగంలో పిజి రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడి భార్య విప్లవశ్రీ కూడా ప్రభుత్వ వైద్యురాలిగా సేవలందిస్తోంది. శ్రీనివాస్ వద్ద నుంచి ఇద్దరు స్నేహితులు రూ.1.78 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. మరో ముగ్గురు ఆయన పేరు 1.35 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్నారు. పలుమార్లు డబ్బులు అడిగిన వాళ్లు ఇవ్వకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. పలుమార్లు భార్యకు చెప్పుకొని బాధను వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం భార్య నిద్రలేచి సరికి భర్త పడిపోయి ఉన్నాడు. అప్పటికే అతడిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.