అమరావతి: ప్రేమపెళ్లి చేసుకుంది, వేధింపులు భరించలేక భర్తను భార్య చంపేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పట్టాభిపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టాభిపురంలోని నేతాజీ నగర్‌లో షేక్ ఖాజా అనే వ్యక్తి ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 17 సంవత్సరాల క్రితం పక్కింట్లో హజారాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులుకు కూమారుడు, కూతురు ఉంది. హజారా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి డబ్బుల విషయంలో దంపతులు గొడవలు జరుగుతున్నాయి. జూన్ 19న భర్త ఫుల్ గా తాగి ఇంటికొచ్చాడు. సంపాదనంతా ఆగం చేస్తున్నావని భార్యతో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో భార్య మెడకు చున్నీతో బిగించి ఊపిరాడకుండా చేశాడు. భర్త నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. భర్త గాఢ నిద్రలోనికి జారుకున్న ముఖంపై దిండు పెట్టి గట్టిగా ఒత్తిపట్టుకుంది. ఊపిరాడక అతడు కళ్లు తేలేశాడు. ఉదయం తన భర్త లేవడం లేదని స్థానిక ఆర్‌ఎంపి వైద్యుడికి సమాచారం ఇచ్చింది. అప్పటికే భర్త చనిపోయాడని పరీక్షించిన ఆర్‌ఎంపి వైద్యులు తెలిపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో ఊపిరాడక చనిపోయాడని తేలడంతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.