రియోడిజనీరో: బ్రెజిల్‌లో మాదకద్రవ్యాల గ్రూప్, భద్రతా బలగాలు మద్య జరిగిన ఎదురుకాల్పుల్లో 64 మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో నలుగురు భద్రతా అధికారులు ఉన్నట్టు వెల్లడించారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో రెడ్ కమాండ్‌కు చెందిన మాదకద్రవ్యాల గ్రూపు అత్యంత శక్తి వంతంగా పని చేస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ గ్రూప్‌ను అంతం చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. 2500 మంది సాయుధ బలగాలతో రెడ్ కమాండ్ గ్రూపును పట్టుకోవాలని ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మాదక ద్రవ్యాల గ్రూపు డ్రోన్లతో సాయుధ దళాలపై దాడులకు పాల్పడింది. రెడ్ కమాండ్ గ్రూపు సభ్యులు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు అధికారులు మృతి చెందారు. ఎదురుల్లో కాల్పుల్లో 60 మంది రెడ్ కమాండ్ చెందిన సభ్యులు హతమయ్యారు. ప్రస్తుతం 81 మంది అనుమానితులరు అదుపులోకి తీసకోవడంతో పాటు 75 రైఫిల్స్, భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 46 పాఠశాలలను మూసివేశామని అధికారులు వెల్లడించారు.