రైలులో కొండ చిలువ కలకలం రేపింది. కదులుతున్న రైలులో ఓ కొండ చిలువ ప్రయాణీకులను భయభ్రాంతులకు గురిచేసింది. రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి కొండ చిలువను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్2 బోగీలో మూత్రశాల వద్ద కొండ చిలువను చూసిన ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. బిగ్గరగా కేకలు పెట్టారు. టిటిఇ అక్కడకు చేరుకుని పామును గుర్తించి సమీప రైల్వే స్టేషన్ ఖమ్మం ఆర్‌పిఎఫ్ పోలీసులకు సమాచారం అందించా డు. వారు ఖమ్మం నగరానికి చెందిన పాములు పట్టే మస్తాన్ అనే వ్యక్తిని పిలిపించారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో రైలు ఆగగానే రైల్వే పోలీసులు, మస్తాన్ బోగి వద్దకు వెళ్లి కొండ చిలువను పట్టుకున్నారు.