తూర్పు పసిఫిక్ జలాల్లో మాదకద్రవ్యాలు తీసుకెళ్తున్నాయన్న అనుమానంతో అమెరికా సైన్యం మూడు దాడులు చేసింది. దాడులలో 14 మంది మరణించగా ఒకరు తప్పించుకున్నారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హేగ్సేత్ ఈ విషయాన్ని ప్రకటించారు.మంగళవారం సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేశారు. ఒకే రోజు మూడు దాడులు జరపడం ఇదే ప్రథమం. ప్రాణాలతో బయటపడిన ఏకైకవ్యక్తిని మెక్సికన్ సెర్చ్ అండ్ రెస్క్యూ అధికారులు రక్షించారని హేగ్సేత్ తెలిపారు. అయితే అతడిని అమెరికాకు అప్పగిస్తారా లేదా అన్నది వెల్లడి కాలేదు. అక్టోబర్ లో కూడా డ్రగ్స్ రవాణా చేస్తున్న పడవపై అమెరికా సైన్యం దాడులు జరిపింది. ఆ దాడులలో ఇద్దరు చనిపోగా, మరొ ఇద్దరిని సైన్యం రక్షించి, వారిని కొలంబియా, ఈక్వెడార్ లకు తిరిగి పంపించింది.