కాకినాడ-మచిలీపట్నం మధ్య మొంథా తీవ్ర తుఫాను తీరం తాకింది. అంతర్వేదిపాలెంలో ఈ తుఫాను తీరాన్ని చేరుకుంది. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ. వేగంతో తుఫాను కదిలింది. మచిలీపట్నానికి 20 కి.మీ. దూరంలో, కాకినాడకు 110 కి.మీ. దూరంలో, విశాఖకు 220 కి.మీల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 90-100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా ఈ తీవ్ర తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.