కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద తేడా లేకుండా సినిమాను హిట్ చేస్తారు ప్రేక్షకులు పెద్ద స్టార్స్ లేకపోయినా.. ఆ సినిమాకు బ్రహ్మరథం పడతారు. అలా ఈ ఏడాది విడుదలైన సినిమా ఒకటి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను మంచి ప్రేక్షకాదరణ పొందింది. సింపుల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ పెడితేు ఏకంగా రూ.75 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాతో అభిషన్ జీవింత్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
అయితే తాజాగా టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్‌కు సంబంధించి గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఆయన ఈ నెల 31న పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ సందర్భంగా టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మాగేశ్ రాజ్ దర్శకుడికి ఖరీదైన బహుమతి ఇచ్చారు. అభిషన్‌కు బిఎండబ్ల్యూ కారును పెళ్లి కానుకగా అందించారు. ఇక పెళ్లి పీటలెక్కపోతున్న అభిషన్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.