ఎంఎల్‌సి కవిత తన పార్ట్‌నర్ రేవంత్‌తో సిఎం పదవికి రాజీనామా చేయిస్తే బిసి రిజర్వేషన్ వచ్చి తీరుతుందని ఎంపి అర్వింద్ ఎద్దేవా చేశారు. వారిద్దరూ వ్యాపార భాగస్వాములేనన్నారు. అందుకే ఇప్పడు రేవంత్ డైరెక్షన్‌లో పనిచేస్తుందని ఆమెతో పార్టీ కూడా పెట్టించబోతున్నాడన్నారు. మాధవనగర్ వంతెన ఆగిపోవడానికి కూడా కవిత పార్ట్‌నర్ రేవంతే నిధులు ఆపేశాడన్నారు. కవితకు ముడుపుల భయంతోనే గుత్తేదారు పారిపోయాడని అర్వింద్ అన్నారు. అలాంటి దిక్కుమాలిన చరిత్ర నీదని, అదే ప్రజలముందు పెట్టాను అందుకే తీహార్ జైలు గతి పట్టిందన్నారు.ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేస్తే ఎందుకు ఆమోదం తెలపడం లేదని మండలి ఛైర్మన్‌కు ఏ ములాఖత్ ఉందన్నారు.
పైగా ఆమెకు ఫోన్ చేసి ఓదార్చిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు. అందుకే బిజెపి రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి కూడా మండలి ఛైర్మన్ కు లేఖ రాసారని సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ప్రస్తావించారని అర్వింద్ పేర్కొన్నారు. రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా బిసి ఎస్‌సి, ఎస్‌టిలను చదువులకు దూరం చేసిందే కల్వకుంట్ల కుటుంబం కదా ! కవిత వెళ్లి కెసిఆర్ ముక్కు పిండాలన్నారు. ఏనాడూ వార్డ్ మెంబర్ కూడా గెలవని మహేష్ కేంద్రం నిధులు ఇవ్వలేదంటున్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎంఎల్‌ఎ థన్‌పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు ఛైర్మన్ గంగారెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మెన్ గంగాధర్ లు పాల్గొన్నారు.