విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆరట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సోమవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా నుంచి తెలుసా నీ కోసమే లిరికల్ సాంగ్ ను ప్రొడ్యూసర్ సురేష్ బాబు అతిథిగా రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ ’తెలుసా నీ కోసమే..’ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు‘ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ కావాలని కోరుకుంటున్నా”అని అన్నారు. నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తు సినిమాను ఎలాంటి వల్గారిటీ లేకుండా మంచి ఫన్, ఎంటర్ టైన్ మెంట్‌తో ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించామని తెలిపారు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ “ఈ రోజు సమాజంలో కపుల్స్ ఎదుర్కొంటున్న సమస్య నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో మూవీ వెళ్తుంటుంది“అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రాంత్, షేక్ దావూద్.జి, అజయ్ అరసాడ పాల్గొన్నారు.