న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బస్సుల్లో అగ్నిప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. గుంటూరు శివారు జరిగిన అగ్నిప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిందే. ఈ ఘటన మరువక ముందే దేశ వ్యాప్తంగా బస్సు ప్రమాదలు అక్కడక్కడ జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడో టర్మినల్ వద్ద ఓ బస్సు దగ్ధమైంది. ట్యాక్సీయింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఎస్ఎటిఎస్ ఎయిర్‌పోర్ట్ సర్వీసస్ ప్రైవేటు లిమిటేడ్ అనే థర్డ్ పార్టీ ప్రొవైడర్ ఈ బస్సు సర్వీస్‌లను అందిస్తోంది.